అక్రమ వలసదారుల అరెస్ట్‌…!

మస్కట్‌: లేబర్‌ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను 480 మంది అక్రమ వలస కార్మికుల్ని అరెస్ట్‌ చేసినట్లు ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ వెల్లడించింది. అలాగే, ఇదే కేసులో మరో 489 మందిని డిపోర్ట్‌ చేయడం జరిగింది. వారం రోజుల్లో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జాయింట్‌ ఆపరేషన్స్‌ ద్వారా, ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారుల వీక్లీ రిపోర్ట్‌ ఈ గణాంకాల్ని వెల్లడించింది. అక్టోబర్‌ 7 నుంచి 18 మధ్య ఈ అరెస్టులు, డిపోర్టేషన్‌ జరిగాయి. క్యాపిటల్‌ అయిన మస్కట్‌లో అత్యధికంగా 118 అరెస్టులు జరగగా, దఖ్లియా గవర్నరేట్‌లో 116 మంది అరెస్ట్‌ అయ్యారు. అరెస్టయినవారికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌లోని సంబంధిత అధికార వర్గాలు, తదుపరి చర్యలను చేపట్టనున్నాయి.

Please follow and like us:

You may also like...