అంజన్నకు ఆగ్రహమొచ్చిందా…?

  • కోతులను చంపడంతోనే ప్రమాదం జరిగిందా…?
  • సూరంపేటలో ఇటీవల 60 కోతుల కళేబరాలు లభ్యం….
  • ఈ ఘటన జరిగిన రెండు రోజులకే..
  • బస్సు ప్రమాదంలో సరిగ్గా 60 మంది దుర్మరణం….
  • జోరుగా చర్చించుకుంటున్న స్థానికులు

జగిత్యాల/కొండగట్టు: అంజన్నకు ఆగ్రహం వచ్చిందా,అంటే ఆవునేమో అనే ప్రశ్నలు వేధించడం మొదలయ్యాయి.  అంజన్నకు ప్రతిరూపమని భావించే వానరాలను చంపడం వల్లే ఈ బస్సు ప్రమాదం సంభవించిందా? జగిత్యాల ప్రాంతవాసులు ఇప్పుడిదే చర్చించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని గోవిందారం దారి పక్కన 60 కోతుల కళేబరాలు కనిపించాయని.వాటిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్‌ షాక్‌ పెట్టి కోతులను హతమార్చినట్లుగా ఉందని కొడిమ్యాల రేంజర్‌ బుర్ర లత అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఇలాంటి దుర్ఘటనలు జరగడం హృదయ విదారక సంఘటనని,మున్ముందు ఇలాంటి ఘటనలు జరగొద్దని ఆశిద్దాం.

అదీ అంజన్నస్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారమే కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కోతుల కళేబరాలు లభ్యమైన సంఖ్యలోనే ప్రయాణికులు మృతి చెందడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోతులను చంపడంతోనే అంజన్నకు ఆగ్రహం వచ్చిందని బుధవారం శనివారంపేట, డబ్బుతిమ్మయ్యపల్లి, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌ తదిర గ్రామాల ప్రజలు ‘తెలిపారు.

Please follow and like us:

You may also like...