అంగరంగ వైభవంగా శ్రీ రాఘవేంద్రుని మహా రథోత్సవం….

కర్నూలు/మంత్రాలయం:జిల్లాలో గల పుణ్యక్షేత్రం మంత్రాలయం లో శ్రీ రాఘవేంద్రస్వామి 347 వ సప్త  ఆరాధన ఉత్సవాలలో భాగంగా ఈ రోజు ఉత్తర  ఆరాధన సందర్భంగా ఈ రోజు శ్రీ రాఘవేంద్రస్వామి మహారథోత్సవం అంగరంగవైభవంగా, కనుల విందుగా జరిగింది. శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు శ్రీ రాఘవేంద్రస్వామి బృందవనానికి మహా మంగళ హారతి ఇచ్చి , ఉత్సవ మూర్తి ఐన ప్రహ్లాదరాయునికి పూజలు చేసి, రంగులు చల్లుతూ వసన్తతోత్సవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

తదనంతరం ఉత్సవమూర్తి ఐనా ప్రహ్లద రాయులను చెక్క రథోత్సవం పై ఉంచి మంత్రాలయం పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిమంది పాల్గొనడం జరిగింది.హెలికాఫ్టర్ ద్వారా శ్రీ మఠం పీఠాధిపతి పూలు చల్లడం చూపరులను ఎంతో ఆకట్టుకుంది. శ్రీ మఠం పీఠాధిపతి మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్రస్వామి కొలిచే వారికి కొంగు బంగారం అని ,రాబోవు రోజుల లో శ్రీ మఠం భక్తులకు ,ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ,గర్భ గుడి ప్రాకారాన్ని వచ్చే ఆరాధన ఉత్సవాలు లోపు స్వర్ణ ప్రాకారంగా చేస్తామని తెలుపడము జరిగింది.

Please follow and like us:

You may also like...